పురమిత్ర యాప్ ను రద్దు చేయాలి..

పురమిత్ర యాప్ ను రద్దు చేయాలి..
విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ నగర అభివృద్ధిలో భాగస్వామి అవ్వడం సంతోషంగా ఉందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మాజీ సిఎం జగన్ బీసీ మహిళను అయిన తనకు మేయర్ అవకాశం కల్పించారని, గత వైసిపి ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి పూర్తి సహకారం అందించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగర అభివృద్ధి ఆగిపోయిందని, విఎంసి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్న చందంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు.
సోమవారం ఉదయం కార్పోరేషన్ ప్రధాన కార్యాలయం లోనీ తన ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ రాయన భాగ్య లక్ష్మి మాట్లాడుతూ ఐదేళ్లు మేయర్ గా తన బాధ్యతలను పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. గత ఐదు సంవత్సరాలు విజయవాడ అభివృద్ధి కి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు ..ఒక బిసి మహిళకు మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి మేయర్ అవకాశం కల్పించారని..
విజయవాడ నగరాభివృద్ధి లో భాగంగా ఎన్నో అవార్డులు అందుకున్నామని గుర్తు చేసారు.తమ వైసిపి ప్రభుత్వంలో బెజవాడను అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా పురమిత్ర యాప్ పై మేయర్ భాగ్యలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేసారు.పురమిత్ర యాప్ ను రద్దు చేయాలని,పురమిత్ర యాప్ ద్వారా 50 శాతం నిధులు ప్రభుత్వానికి వెళ్తున్నాయని ఆరోపించారు. బెజవాడ అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో ఎక్కడ జరుగుతుందని వ్యంగ్యం ప్రదర్శించారు. విజయవాడ నగర అభివృద్ధి జరగలే దంటున్న టిడిపి నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంది అని ఏ విధంగా చెప్తారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి బుడమేరు అభివృద్ధి కి రూపాయి బిల్లు రాలేదని, టిడిపి చెప్పే మాటలు ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. వైసిపి హయాం లోనే అభివృద్ధి జరిగిందని ప్రజలందరికీ తెలుసని, ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి అప్పు కూడా తాము చేయలేదని, పిపిపి విధానంకు మేం పూర్తిగా వ్యతిరేకమని ఉద్దటించారు.. విజయవాడ నగర లో 2021 నుంచి ఇప్పటి వరకు రూ.9147.28,లక్షల తో తారు రోడ్లు నిర్మాణం. రూ.10137.70,లక్షలతో సిమెంట్ రోడ్లు నిర్మాణం. రూ.1520.02 మంచినీటి సరఫరా కోసం పైపు లైన్ల ఏర్పాటు చేశాం అన్నారు.
15 వ డివిజన్ రామలింగేశ్వర నగర్ లో రూ.400.00 లక్షల తో 1500 కెపాసిట్ మంచినీటి సరఫరా రిజర్వాయర్ ను నిర్మాణం, 2021 నుంచి ఇప్పటి వరకువిజయవాడ నగరంలో రూ. 2340.50 డ్రైన్ల, నిర్మాణం, రూ.2267.35లతో అండర్ డ్రైన్ల నిర్మాణం, విజయవాడ నగరంలో మన బడి నాడు – నేడు, కార్యక్రమం ద్వారా విజయవాడ నగరంలో రూ.1519.48,లక్షలతో 40 హైస్కూల్ ను ఆధునీకరణ,అదనపు తరగతుల కోసం 42 గదులు నిర్మాణం.
విజయవాడ నగరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 227 పనులు రూ.1715.15, చేపట్టిన 86 పనులు రూ.802.76 లక్షలతో పూర్తి చేయమని ఆమె తెలిపారు. రాజీవ్ గాంధీ పార్కును రూ.257.00,లక్షలతోను , కె. ఎల్ రావు పార్కు ను రూ.2.35 లక్షల తో రూ.2.00 కోట్లతో గాంధీ హిల్ ప్లానిటోరియం నిర్మాణం, విద్యాధర పురం లో రూ.1 .75 కోట్లతో పుడ్ కోర్టు ఏర్పాటు. కృష్ణలంక అంబేద్కర్ పార్కు ను 275.00 లక్షల తో పూర్తి చేశాం.నగరం లో 8 పార్కులు రూ.166.69, అందుబాటులోకి తీసుకువచ్చినాముము, రూ 594.03 లక్షల తో జగనన్న హరిత నగరాలు, రూ.802.43, అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు,..
పారిశుధ్య నిర్వహణ పనులు కోసం నగర్ పాలక సంస్థ గత ఐదు సంవత్సరాల కాలం లో జాతీయ స్థాయి లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు, 4 స్టార్,5 స్టార్ రేటింగ్ లో అవార్డులు రావటం జరిగింది అన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం లో నగర పాలక సంస్థ ఆన్ లైన్ ద్వారా వచ్చిన 9,934 దరఖాస్తులు ను పరిష్కరించి రూ.286,78,87, 912కోట్ల ఆదాయం వచ్చింది.
వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రతి నెల 66,977 పెన్షన్లు పంపిణీ. వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ భీమా ,జగన్న తోడు, వై.ఎస్.ఆర్ చేయూత, వై ఎస్ ఆర్, జగనన్న కాలనీలు , వై ఎస్ ఆర్, కాపు నేస్తం, వాహన మిత్ర, ఇ.బి.సి, నేస్తం, బ్యాంకు లాంకేజీ, పి.యం, స్వామిది, టిడ్కో ఇళ్లు, రాపిడో బైకులు, వంటి స్కీమ్ ల ద్వారా అందజేయడం జరిగిందనీ మేయర్ రాయన భాగ్య మీడియా సమావేశంలో తెలిపారు.
