Burrilanka gang rape case : నలుగురికి జీవిత ఖైదు
Burrilanka gang rape case : నలుగురికి జీవిత ఖైదు
- వివాహిత పై సామూహిక హత్యాచారం
- దోషులకు కోర్టు కఠిన శిక్ష
- కడియం కేసులో సంచలన తీర్పు
- దర్యాప్తు బృందానికి రివార్డులు
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్)
తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన రౌతు కస్తూరి అను వివాహిత 15.10.2024 న మధ్యాహ్నం 2:00 సమయంలో నర్సరీ పని నిమిత్తం బుర్రిలంక వంతెన దగ్గరలోని పాఠం శెట్టి రాముడు నర్సరీ లోకి పనికి వెళ్ళింది. సాయంత్రం ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త ఫోన్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ దొరకలేదు. 16.10.2024 వ తేదీన కడియం పోలీస్ స్టేషన్ లో భర్త ఫిర్యాదు చేయగా క్రైం నెంబర్: 314/ 24 U/H women missing గా కేసు నమోదు చేశారు. 17.10.2024 వ తేదీన చొప్పెల్ల లాకుల సమీపంలో కస్తూరి మృతదేహాన్ని గుర్తించి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పటల్ తరలించారు. ఈ కేసును women missing Alter to 194 BNSS గా కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం జరిపించారు.
Burrilanka gang rape case : ఆ రోజు ఏం జరిగిందంటే..
30.10.2024 తేదీన ఈ కేసులో కడియం మండలం. బుర్రిలంక గ్రామానికి చెందిన దేవర యేసు (26), వెలుబుడి ప్రవీణ్ (21) , లోకిన జయ ప్రసాద్ (19), దాసరి సురేష్ (22) . సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో నర్సరీ మొక్కల మధ్యలో మద్యం సేవిస్తూ నర్సరీ పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న రౌతు కస్తూరిని పట్టుకుని సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాన్నిఆ పక్కనే కాలువలోకి విసిరేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సౌత్ జోన్ డి.ఎస్.పి భవ్య కిషోర్ 70(1), 103(1), 238 R/W 3(5) BNS ప్రకారం ఈ నలుగురిని అరెస్టు చేసి ది.30.10.2024 జ్యుడీషియల్ రిమాండ్ పంపించారు. తదుపరి దర్యాప్తు అనంతరం సౌత్ జోన్ డి.ఎస్.పి .భవ్య కిషోర్ నలుగురు నిందితులపై ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఈ కేసులో వాదోప వాదాల అనంతరం పై నలుగురికి ది.16.03.2026 తేదిన జీవిత ఖైదు, ఒక్కొక్క ముద్దాయికి రూ. 2000/- చొప్పున జరిమానా శిక్షను VIII ADJ కోర్గు జడ్జి విధించారు. జరిమాన, చెల్లించని పక్షంలో ఆరు నెలల జైలు శిక్ష విధించినారు.
Burrilanka gang rape case : దర్యాప్తు బృందానికి రివార్డులు
ఈ కేసులో దోషులకు జీవిత ఖైదు పడటం లో ముఖ్య పాత్ర వహించిన APP . K రాధ కృష్ణ రాజు , దర్యాప్తు అధికారి , సౌత్ జోన్ డి.ఎస్.పి ఎస్. భవ్య కిషోర్ FIR నమోదు అధికారి కడియం ఎస్ ఐ B. నాగ దుర్గ ప్రసాద్ , కోర్డు కానిస్టేబుల్ K శ్రీనివాస్ , దర్యాప్తు కు సహకరించి, సాక్ష్యులను కోర్డు కు హాజరు అయ్యేలా చూసిన కడియం సీఐ A వెంకటేశ్వరరావు , హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుల్ వాసు భీమారావు ను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కి.షో.ర్ ప్రత్యేకంగా అభినందించారు. రివార్డులు ప్రకటించారు.
