MYSTERY| డెత్ మిస్టరీ

MYSTERY| ఊయ్యురు, ఆంధ్రప్రభ : ఉయ్యూరుకు చెందిన మీ సేవ రవి అనే వ్యక్తి గురువారం అర్ధరాత్రి నుంచి కనబడట్లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం తోట్లవల్లూరు రోడ్డులోని అమ్మనా కాలనీ రోడ్డు ఎదురుగా పుల్లేరు కాలువలో రవి మృతదేహం లభ్యమైంది. ఇతని ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు పలువురి కంటతడి పెట్టించింది.
