పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ

పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ

లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ: పట్టణంలోని గోదావరి వద్ద వచ్చే ఏడాది తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న పుష్కరాలు ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ ఎగ్గిడి భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు అధిక సంఖ్యలో పుణ్యాస్నానాలు చేసేందుకు భక్తులు రానున్నారని వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలం తో పాటు ఆలయాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ముందునుండే అధికారులంతా సరిచూసుకోవాలని సూచించారు.

పార్కింగ్ స్థలం మొత్తం క్లీన్ చేయించి వాహనాలు పెట్టుకునేందుకు వీలుగా ఉండేటట్టు చూడాలని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ తో ఏర్పాట్ల గురించి చర్చించారు. డిసిపి వెంట మంచిర్యాల ఏసిపి ప్రకాష్, తాసిల్దార్ దిలీప్ కుమార్,లక్షట్టిపేట సీఐ రమణమూర్తి,మున్సిపల్ కమీషనర్ విజయ్ కుమార్,ఎస్సై గోపతి సురేష్ ఉన్నారు.

Leave a Reply