దిల్దార్ నగర్ లో చలివేంద్రం ప్రారంభం..

కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని దిల్దార్ నగర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రమును గురువారం దిల్దార్ నగర్ గ్రామ సర్పంచ్ బద్దనపల్లి స్టీఫెన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్టీఫెన్ మాట్లాడుతూ.. దిల్దార్ నగర్ జిపి పరిధిలో గల ప్రజలు చలివేంద్రమును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ ఎస్ పాఠశాల హెచ్ఎం వినయ్ కుమార్, జిపి వార్డు సభ్యులు కారోబార్ చారి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply