Crime | ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఇద్దరిపై కేసు..

Crime | ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఇద్దరిపై కేసు..

Crime | నర్సంపేట,క్రైo, ఆంధ్రప్రభ : ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన నర్సంపేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోమంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుండి మహబూబాబాద్‌ (Hyderabad to Mahbubabad)కు వస్తున్న ఆర్‌టీసీ బస్సు వరంగల్ చేరుకున్న‌ తర్వాత ఇద్దరు ప్యాసింజర్‌లు(Two passengers) దొంతి రాంరెడ్డి, దొంతి లక్ష్మరెడ్డిలు నర్సంపేటకు టికెట్ తీయనుకోని బస్సు ఎక్కారు.

నర్సంపేట బస్సు స్టాప్ వచ్చాక డ్రైవర్ కం కండక్టర్ చీకటి వెంకటయ్య(Venkataiah) దొంతి రాంరెడ్డి, దొంతి లక్ష్మరెడ్డి ఇద్దరిని బస్సు దిగమని చెప్పక బస్సు దిగాం అని చెప్పడమే కాకుండా డ్రైవర్ వెంకటయ్యను అసభ్య కరంగా తిట్టి కొట్టడంతో వెంకటయ్య పిర్యాదు మేరకు ఇద్దరి పై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన‌ట్లు ఎస్సై తెలిపారు.