జగ్జీవన్ రామ్ సేవలు స్ఫూర్తిదాయకం…

జగ్జీవన్ రామ్ సేవలు స్ఫూర్తిదాయకం…

  • దళిత హక్కుల కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయం
  • సామాజిక సమానత్వానికి జగ్జీవన్ రామ్ కృషి చిరస్మరణీయం
  • అణగారిన వర్గాల కోసం పోరాడిన నేతకు ఘన నివాళులు
  • తాటికొండలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
  • మాజీ జడ్పి స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామంలో ఆదివారం భారత మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడు కలు బాబు జగ్జీవన్ రామ్ కమిటీ అధ్యక్షుడు మారపాక నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విగ్రహ వ్యవ స్థాపకులు, మాజీ జడ్పీటీసీ, జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, సర్పంచ్ మారపాక సృజన శ్రీనివాస్ హాజరై జగ్జీవన్ రామ్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన సేవల ను స్మరించారు.

ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ బి.ఆర్.అంబేద్క ర్ రాజ్యాంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా వారి హక్కులను తరతరాల పాటు రక్షించే విధంగా నిబంధనలు ఏర్పాటు చేశారని కొనియాడారు. సామా జిక సమానత్వం కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే అణగారిన వర్గాలపై జరు గుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరా డిన జగ్జీవన్ రామ్ స్వాతం త్ర్య సమరంలో పాల్గొని దేశ సేవలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో అనేక కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ఆయన, 1977లో దేశ ఉప ప్రధాని గా బాధ్యతలు చేపట్టి ప్రజా సంక్షే మానికి కృషి చేశారని గుర్తుచేశారు.

దళితులు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో ఉప సర్పంచ్ ఎడమ కట్టమల్లు, వార్డు సభ్యులు మారపాక ఏలీయా, నలిమేల కోమల, మాజీ ఉప సర్పంచ్ మారపాక రాములు, విగ్రహ కమిటీ ప్రధాన కార్యదర్శి మారపాక రాంచందర్, ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మారపాక సంపత్, బీఆర్ఎస్ నాయకుడు మార పాక మనోహర్, సీపీఎం నాయ కుడు మారపాక మధు బాబు, కుల పెద్దలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply