Crim | భార్యను హత్య చేసిన భర్త…
Crim | భార్యను హత్య చేసిన భర్త…
Crim | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలో కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను భర్త హత్య చేసిన ఉదంతం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య చోటుచేసుకున్న ఈ ఘటనలో MSC ఫారం గ్రామానికి చెందిన షేక్ హుస్సెన్(Sheikh Hussain), తన భార్య ఆసియా బేగం (40)తో ఇంటివద్ద తీవ్ర వాగ్వాదానికి దిగాడు.
కోపావేశంలో భార్య తలను గోడకు గుద్దడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఎడపల్లి పోలీసులు ఆసియా బేగం బంధువుల ఫిర్యాదుతో నిందితుడు షేక్ హుస్సెన్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
