Court | 347 కేసులు పరిశీలనకు..

Court | 347 కేసులు పరిశీలనకు..

Court | చెన్నూర్, ఆంధ్రప్రభ : క్షనిక ఆవేశంలో పొరపాటు జరిగి పోలీస్ స్టేషన్(Police station), కోర్టులకు హాజరై క‌క్షిదారులు లోక్ ఆదాలత్(Lok Adalat)లో రాజీ పడ్డట్లయితే రాజమార్గం లభిస్తుందని చెన్నూరు మున్సిఫ్ కోర్టు(Munsif Court) జడ్జి పర్వతపు రవి అన్నారు. ఈ రోజు స్థానిక మున్సిఫ్ కోర్టు ఆవరణలో స్పెషల్ లోక్ ఆదాలత్(Special Lok Adalat) జడ్జి సమక్షంలో నిర్వహించారు.

లోక్ ఆదాలత్ లో మొత్తం 347కేసులు పరిశీలనకు రాగ అందులో 273, డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and Drive), న్యూసెన్స్ కేసులు 18బ్యాంక్ లావాదేవీలా పరిష్కారం జరిగాయి. 42 క్రిమినల్ కేసులు, రెండు సివిల్ కేసులు రాజీ పడడం జరిగినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, చెన్నూర్, కోటపెల్లి, జైపూర్, భీమారం, నీ ల్వాయి, పోలీస్ అధికారులు, వివిధ బ్యాంక్ ల అధికారులు పాల్గొన్నారు.