రూ.32 కోట్లతో 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ అభివృద్ధి…

రూ.32 కోట్లతో 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ అభివృద్ధి…

రిటైనింగ్ వాల్ నిర్మాణం వైసీపీ ప్రభుత్వం లో పూర్తి
15 వ డివిజన్ తో పాటు డిప్యూటీ మేయర్ నగర అభివృద్ధికి కృషి
మంచి నీటి రిజర్వాయర్ నిర్మాణం పూర్తి
కూటమి ప్రభుత్వం వచ్చిక నగరం లో అభివృద్ధి శూన్యం
మహిళలకు పదవులు కల్పించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి
డిప్యూటీ మేయర్ పదవీ కి అవకాశం ఇచ్చిన అవినాష కు ,జగనన్నకు కృతజ్ఞతలు
డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ…

విజయవాడ కార్పోరేషన్, ఆంధ్ర‌ప్ర‌భ : విజయవాడ నగర డిప్యూటీ మేయర్ పదవి ఐదు సంవత్సరాలు కల్పించిన వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ధన్యవాదాలు తెలిపారు.. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఇవ్వడం సంతోషకరమని చెప్పారు.. కార్పొరేషన్ లో గతం లో ఎన్నడూ లేని విధంగా ఈ పదవులు ఇచ్చిన జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు..

నగర పాలక సంస్థ కార్యాలయం లోని తన చాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మాట్లాడుతూ కార్పొరేటర్ గా సీటు ఇచ్చి గెలిపించి డిప్యూటీ మేయర్ పదవిలో ఉండేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన వైసిపి అధినేత జగన్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.. తన తండ్రి ఆళ్ల చల్లా రావు కి దేవినేని నెహ్రూ రాజకీయ ఎదుగుదలను ఇస్తే తనకు అవినాష్ అండగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు..

కార్పొరేటర్ గా 15వ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు డిప్యూటీ మేయర్ గా నగరాభివృద్ధి తో పాటు కృష్ణ లంక ప్రాంత ప్రజల చిర కాల కోరిక అయిన రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని వైసీపీ హయాంలో పూర్తి చేశామని చెప్పారు.. విజయవాడ తూర్పు నియోజకవర్గం లో అనేక అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ ది అని నేడు కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్ల పాలన లో చేసిందేమీ లేద న్నారు.. తమ సొంత డివిజన్ అయిన 15 వ డివిజన్ లో రూ.32 కోట్ల తో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు.. పనులు చేసేందుకు సహకరించిన మున్సిపల్ కమిషనర్ కు, ఉన్నతాధికారులు సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారు..

డివిజన్ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అన్ని పనులు పూర్తి చేశామన్నారు.. సిసి రోడ్లు, డ్రైనేజ్ పనులు, విద్యుత్ లైట్లు, మరెన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు.. మేము చేసిన పనులకు కూటమి నేతలు కొబ్బరి కాయలు కొట్టుకోవడం తప్ప వారు చేసిన నిజమైన అభివృద్ధి ఏమీ లేదన్నారు.. మేము చేసిన అభివృద్ధి చర్చించేందుకు సిద్ధమని సవాల్ చేసిన కూటమి నేతలు ముందుకు రావడం లేదన్నారు.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దగ్గరకు రావచ్చని నాకు అన్ని విధాల తోడుగా ఉన్న డివిజన్ ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్పారు..

Leave a Reply