జగన్మాత సేవలో మంత్రి అనిత

- హోంమంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం
- కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు
విజయవాడ, ఆంధ్రప్రభ : నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి దేవస్థానం ఈవో శీనా నాయక్, దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.
మంత్రి అనిత కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఈవో, చైర్మన్‌లు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
