క్రిస్మస్ వేడుకల్లో కొలికపూడి..

తిరువూరు, ఆంధ్రప్రభ : పట్టణంలో నిర్వహించిన ఎంసీవై (MCY) 25వ వార్షికోత్సవ క్రిస్మస్ వేడుకల్లో తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మధిర రోడ్డులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సహాయ సహకారాలతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మధిర రోడ్ యువత, మహిళలు, స్థానిక నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమం నిర్వహణ కోసం ఎమ్మెల్యే లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో ఎంసీవై కమిటీ సభ్యులు వేడుకలను వైభవంగా నిర్వహించారు.

కార్యక్రమంలో భాగంగా పలు ఆటల పోటీలు నిర్వహించగా, విజేతలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేతులమీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్‌ను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన సతీమణి మాధవితో కలిసి కట్ చేసి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply