వ్యభిచారం కేసులో నలుగురిపై కేసు నమోదు

వ్యభిచారం కేసులో నలుగురిపై కేసు నమోదు
భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నుండి కాల్ గర్ల్స్ ను రప్పించి వ్యభిచారం చేపిస్తున్న సంఘటన భీమ్గల్ లో జరిగింది. భీమ్గల్ మున్సిపల్ లో ఇలాంటి సంఘటన వెలుగు చూడడం సంచలనం స్ట్రష్టించింది. హైదరాబాద్ నుండి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్టు సమాచారం పోలీసులకు అందింది. వివరాలు ఇలా ఉన్నాయి.
భీమ్గల్ పోలీస్ స్టేషన్ ఎదుట డ్రెస్సెస్ షాప్ ఏర్పాటు చేసిన నిజామాబాద్ అశోక్ ఫారం కు చెందిన చందు, హమాలీ వాడి కి చెందిన కమలేష్ లు బాపూజీ నగర్ లో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అద్దెకు తీసుకున్న ఇంటిలో హైదరాబాద్ నుండి అమ్మాయిలను తెచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అమ్మాయిలను యూత్ పిల్లలకు ఎరగా వేసి డబ్బులు సంపాదించేందుకు పూను కున్నారు. గత రెండు, మూడు నెలల నుండి ఈ వ్యవహారం గుట్టుగా సాగుతున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో హైదరాబాద్ నుండి ఇద్దరు అమ్మాయిలు వచ్చారని వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులకు ఈ నెల 14 న విశ్వసనీయ సమాచారం అందింది. దాంతో ఎస్సై సిహెచ్.తిరుపతి ఆధ్వర్యంలో వ్యభిచార గృహం పై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార నిర్వాహకులు చందు, కమలేష్ తో పాటు హైదరాబాద్ నుండి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు, అమ్మాయిలతో వ్యభిచారం చేసేందుకు వచ్చిన భీమ్గల్ మండలం పురాణిపేట్ కు చెందిన మైనర్ తో పాటు వికాస్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్బంగా వ్యభిచార గృహం నుండి రూ 2450, నాలుగు మొబైల్స్, లిక్కర్ బాటిల్స్, కండోమ్స్ స్వాధీనం చేసున్నట్టు ఎస్సై తెలిపారు. వ్యభిచార గృహం లో దొరికిన ఇద్దరు అమ్మాయి లను సదరం హోమ్ కు తరలించారు.మిగితా నలుగురి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఎస్సై పేర్కొన్నారు.
భీమ్గల్ లో సంచలనం…
ఎన్నడు లేని విధంగా భీమ్గల్ లో వ్యభిచారం చేయిస్తున్న ముఠా బయటకు రావడం సంచలనం సృష్టించింది.గుట్టుగా సాగుతున్న ఈ దందా నిర్వహించేందుకు ఏకంగా భీమ్గల్ దుకాణం ఏర్పాటు చేసుకోవడం చర్చకు దారితీసింది. పేరుకు మాత్రం షాప్ నిర్వహణ అసలు వ్యాపారం మాత్రం వ్యభిచారం.
ఏకంగా హైదరాబాద్ నుండి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయించడం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించడం కొరకు ఈ వృత్తిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి వ్యవహారం భీమ్గల్ లో ఇంకా కొన్ని చోట్ల జరుగుతున్నట్టు సమాచారం ఉంది.పోలీసులు లోతుగా విచారణ చేస్తే మరింత మంది దొరికే అవకాశం ఉంది.
