కడియం కటౌట్ కు వినతిపత్రం అందజేత..

చిలుపూర్, ఆంధ్రప్రభ ; బిఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచిన కడియం శ్రీహరి, నేటికీ టిఆర్ఎస్ పార్టీ ద్వారానే జీతం తీసుకుంటున్నాడని మల్కాపూర్ గ్రామంలో మహిళలు అన్నారు. చిలుపూర్ మండలం మల్కాపూర్ లో కడియం శ్రీహరి కటౌట్ కు శనివారం మహిళలు వినతి పత్రాన్ని అందించారు. కడియం శ్రీహరి మక్కల గురించి అసెంబ్లీలో మాట్లాడిన కడియం శ్రీహరి మహిళలకు రేవంత్ రెడ్డి ఇస్తానన్న రూ.2500 గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు.
తులం బంగారం గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు.రైతు భరోసా గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సర్పంచ్ ఎన్నికలలో మల్కాపూర్ గ్రామాన్ని మండలం చేస్తానన్న కడియం శ్రీహరి ఇచ్చిన మాట మారిచారన్నారు. బిఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచిన కడియం శ్రీహరి, నేటికీ టిఆర్ఎస్ పార్టీ ద్వారానే జీతం తీసుకుంటున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని రేవంత్ రెడ్డిని ఎంఎల్ఎ శ్రీహరి ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.
