మూడో డివిజన్‌లో హస్తం హవా…

మూడో డివిజన్‌లో హస్తం హవా…

కాంగ్రెస్ అభ్యర్థి హస్తం దెబ్బకు కారు ఢమాల్,వాడిన కమలం!

మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గుమాల్ మమత శ్రీనివాసులు చుట్టూ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన ఈ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు, తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణ మహిళగా ప్రజల మధ్య నుంచే ఎదిగి, సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన గుమాల్ మమత శ్రీనివాసులు ప్రచారంలో చూపుతున్న చొరవ, సమస్యలపై ఆమెకు ఉన్న అవగాహన ఓటర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మహిళలు, యువత, మధ్యతరగతి వర్గాల్లో ఆమెకు లభిస్తున్న ఆదరణ గమనార్హంగా మారింది.

ఎలాంటి అధికార పదవి లేకుండానే అభ్యర్థి భర్త గుమాల్ శ్రీనివాసులు గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు డివిజన్ ప్రజలకు ఇప్పటికీ గుర్తుండటంతో, అదే సేవాభావం మమత శ్రీనివాసులు ద్వారా కొనసాగుతుందన్న విశ్వాసం బలపడుతోంది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మూడో డివిజన్‌ను హైటెక్ అభివృద్ధి దిశగా నడిపిస్తామన్న ఆమె హామీకి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఈ నమ్మకంతోనే కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారంలో ఊపందుకోగా, హస్తం గుర్తు చుట్టూ ఓటర్లు ఏకమవుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దూకుడుకు ప్రత్యర్థుల శిబిరాల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. బి.ఆర్.ఎస్ అభ్యర్థి కారు డ్యామేజ్ అయిందని, బీజేపీ కమలం వాడిపోయిందని స్వయంగా ఓటర్లే చర్చించుకోవడం మూడో డివిజన్‌లో రాజకీయ వాతావరణాన్ని వెల్లడిస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ హస్తం జోరుతో మూడో డివిజన్‌లో గుమాల్ మమత శ్రీనివాసులు విజయం దిశగా దూసుకుపోతున్నారన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.