Commissioner | ఓటు హక్కును వినియోగించుకోవాలి

Commissioner | ఓటు హక్కును వినియోగించుకోవాలి

  • ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి

Commissioner | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా పోలీస్ కమిషనర్(Commissioner) సాయి చైతన్య(Sai Chaitanya) ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే సైబర్ సురక్ష -జాతీయ భద్రత పై ఎస్సై కే. సందీప్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

భీమ్‌గల్ మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని గ్రామ ప్రజలకు స్థానిక ఎస్సైకే. సందీప్, ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్(Gangula Santosh Kumar) అన్నారు. ఈ రోజు మండలంలోని పల్లికొండ, ముచ్కూర్, పురాణిపేట్, గ్రామాలలో ప్రజలతో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ముఖ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై కే.సందీప్, ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు సూచనలు చేశారు. ఓటు విలువైనదని, డబ్బు, మద్యం, బహుమతులు ఇతర ప్రలోభాలకు ఎవరైనా గురి చేస్తే అధికారులకు, పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రతి ఒక్కరూ స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

రాబోయే ఎన్నికలు పూర్తిగా శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే సైబర్ సురక్ష -జాతీయ భద్రత పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ బలు సూచనలు చేయడం జరిగింది. అలాగే ఎన్నికల సందర్భంగా నామినేషన్ కేంద్రాలను స్థానిక ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ సందర్శించి దానికి అధికారులతో సమీక్ష సమావేశం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply