colse | ముగిసిన మున్సిపల్ ఎన్నికలు..

colse | ముగిసిన మున్సిపల్ ఎన్నికలు..
69.78 శాతం నమోదు
చెదురు ముదురు ఘటనలు
colse | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా భీంగల్ మున్సిపల్ లో 12 వార్డులకు బుధవారం జరిగిన పోలింగ్ 69.78 శాతం నమోదయింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధుల కోసం వీల్ చైర్ లను ఏర్పాటు చేశారు.
బొంబాయి నుండి ఓటు వేసేందుకు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు బొంబాయి, మహారాష్ట్ర, హైదరాబాదు లాంటి దూర ప్రాంతాల నుండి హాజరై ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయ సంగీత అనే దంపతులు బొంబాయి నుండి వచ్చి ఓటును వేశారు. ఏ ఎన్నికలు జరిగినా తాము ముంబాయి నుండి వచ్చి ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామని వారు తెలిపారు.
4వ వార్డులో స్వల్ప ఉద్రిక్తత
బుధవారం జరిగిన పోలింగ్ లో భాగంగా పట్టణ కేంద్రంలోని బోయి గల్లి లో గల బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత జరిగింది. 4వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓటు వేసేందుకు వచ్చేవారిని కేంద్రం వద్ద గల ఒక ఇంటిలోకి తీసుకెళ్లి డబ్బులు పంచుతున్నారని బీజేపీ అభ్యర్థి నిలదీయగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఏసీపీ లు వెంకటేశ్వర్ రెడ్డి, రాజశేఖర్ ల ఆధ్వర్యంలో సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్, ఎనిమిది మంది ఎస్సై లు, పది మంది ఏ ఎస్సైలు, 110 మంది మెన్, విమెన్ పీసీ లను ఎన్నికల్లో వినియోగించారు. 12 సెంటర్స్ 24 బూత్ లలో నిర్వహించిన ఎన్నికల్లో చిన్న, చిన్న సంఘటనలు మినహాయించి ప్రశాంతంగా ఎన్నికలు ముగిసాయి. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ బూత్ లో ఉన్న ఓటర్ల కు ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు.
