పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పస్రా ఎస్ ఐ తాజుద్దీన్

బాధ్యతలు చేపట్టిన తాజుద్దీన్

గోవిందరావుపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పస్రా పోలీస్ స్టేషన్ ఎస్ ఐ తాజుద్దీన్ ఎన్నికయ్యారు. బుధ వారం జిల్లా పోలీస్ అధికారుల సంక్షేమం, పరస్పర సహకారం, సేవా కార్యక్రమాల బలోపేతానికి కృషి చేసే లక్ష్యంతో ఏర్పాటైన అసోసియేషన్‌కు కమిటీ లో తాజుద్దీన్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్సై తాజుద్దీన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, అసోసియేషన్ ద్వారా పోలీసు అధికారుల సంక్షేమం కోసం నిబద్ధతతో పని చేస్తానని తెలిపారు.
ఎస్సై తాజుద్దీన్ ఎన్నిక పట్ల జిల్లా పోలీసు అధికారులు, సహచర సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.