Collector | చీర అడ్డుపడి అదుపుతప్పిన సైకిల్

Collector | చీర అడ్డుపడి అదుపుతప్పిన సైకిల్

Collector | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మార్టేరులో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఆమె, సైకిల్ తొక్కుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొంటున్న సమయంలో కలెక్టర్ నాగరాణి ధరించిన చీర సైకిల్ చక్రానికి అడ్డుపడింది. దీంతో సైకిల్ ఒక్కసారిగా అదుపుతప్పి ఆమె కిందపడిపోయారు. ఘటనను గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆమెకు సహాయం చేశారు.

ఈ ఘటనలో కలెక్టర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అనంతరం ఆమె యథావిధిగా కార్యక్రమంలో పాల్గొని ఇతర అధికారిక కార్యక్రమాలను కొనసాగించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.