ACB | రూ.100 కోట్ల ఆస్తులు గుర్తింపు..

ACB | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో అవినీతి అక్రమాలపై యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) మరోసారి ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు.
ACB | 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు…

మల్లాపూర్‌లో ఉన్న జీఎం కుమార్ నివాసంతో పాటు ఆయన సన్నిహితులు, బంధువులకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఉదయం 6 గంటలకే ప్రత్యేక బృందాలు చేరుకుని ఎవరూ బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి.
ACB | నగదు, బంగారం స్వాధీనం…

ఇప్పటివరకు జరిగిన సోదాల్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులను అధికారులు గుర్తించినట్లు సమాచారం. నిజామాబాద్‌లో మూడు ఎకరాల భూమి, హైదరాబాద్‌లో మూడు ఫ్లాట్లు, ఆరు ఓపెన్ ప్లాట్లు బయటపడ్డాయి. అలాగే ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.1.10 కోట్ల నగదు, కిలోకు పైగా బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.
