CSK vs SRH | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

చెన్నై : ఐపీఎల్‌లో ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ వ‌ర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ పదో స్థానంలో ఉంది. హెడ్ టు హెడ్ రిజల్ట్స్‌లో హైదరాబాద్‌పై చెన్నైదే పైచేయి. చెపాక్ స్టేడియంలో ఇప్పటి వరకు సన్‌రైజర్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలిచిన దాఖలాలు లేవు.

ఐపీఎల్ 2025లో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. పాయింట్స్ టేబుల్‌లో చివరి రెండు స్థానాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తర పోరుకు చెపాక్ స్టేడియం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్‌కి వెళ్లే అవకాశం దక్కనుండగా.. ఓడిపోయిన జట్టు ఇంటిదారి పట్టడం ఖాయం.

Leave a Reply