ముంబై : సీనియర్ క్రికెటర్ 33ఏళ్ల కరుణ్ నాయర్‌కు ఎట్టకేలకు టీమ్ఇండియా పిలుపు అందింది. గత కొంతకాలంగా దేశవాళీలో అదరగొడుతున్న కరుణ్‌ను సెలక్టర్లు ఇంగ్లాండ్ సిరీస్‌కు ఎంపిక చేశారు. 2016లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన కరుణ్ 6 మ్యాచ్‌లే ఆడాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ ఉంది. అయితే ఆ తర్వాత ఏడాదే 2017లో కరుణ్ జట్టులో చోటు కోల్పోయాడు. అప్పట్నుంచి టీమ్ఇండియాలో రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తే, ఇన్నేళ్లకు అవకాశం దక్కింది.
వీళ్లు తొలిసారిగా..
సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, అర్షదీప్ సింగ్ ముగ్గురు యంగ్ ప్లేయర్లకు లక్కీ ఛాన్స్ దక్కింది. వీళ్లు తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. ఇంగ్లాండ్ సిరీస్‌లో వీళ్లు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. కాగా, సాయి సుదర్శన్, అర్షదీప్ ఇప్పటికే టీ20, వన్డేల్లో ఆడినప్పటికీ టెస్టుల్లో అవకాశం ఇదే ఫస్ట్ టైమ్. మరోవైపు, అభిమన్యు టీమ్ఇండియాకు ఎంపికవ్వడం ఇదే తొలిసారి.
సీనియర్లకు నో ప్లేస్!
మరోవైపు, సీనియర్ బ్యాటర్లు అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారాకు మరోసారి నిరాశే మిగిలింది. రోహిత్, విరాట్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఈ ఇద్దరికీ అవకాశం వస్తుందని భావించినా… సెలక్టర్లు మొండి చేయి చూపారు. రహానే, పుజారా టీమ్ఇండియా తరఫున 2023రలో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడారు.