జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో స్వచ్ఛఆంధ్ర–స్వర్ణాంధ్ర

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శనివారం “స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర (SASA)” కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను కూడా అలవర్చుకోవాలని అధికారులు సూచించారు. స్వచ్ఛతను ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ను అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ డిప్యూటీ డెమో సుబ్రహ్మణ్యం, డిప్యూటీ హెచ్‌ఈఓ రామలక్ష్మి, సీఎచ్‌ఎస్‌ఓ వన్నప్ప, ఎంపీహెచ్‌ఈఓ గఫూర్, ఇన్‌చార్జ్ ఏఎంఓ లక్ష్మీనాయక్, కార్యాలయ సూపరింటెండెంట్ ఫిరోజ్, నాగభూషణం, డీపీఓ నాగరాజు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.