నర్సంపల్లి పెద్ద తండాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నర్సంపల్లి పెద్ద తండాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నార్సింగి, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి పెద్ద తండాలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు భాషా నాయక్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా మూడవత్ మోతిరాంకు రూ.25,500, బానోత్ రాజేష్‌కు రూ.12,000 సీఎంఆర్ఎఫ్ సహాయం అందించారు. ఈ సహకారం అందించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భద్య, శుభాష్, శంతోష్ తదితరులు పాల్గొన్నారు.
