CM Revanth | ఇందిరమ్మ చీరల పంపిణీ…
CM Revanth | ఇందిరమ్మ చీరల పంపిణీ…
CM Revanth | కడం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని కొండుకూర్ గ్రామ పంచాయతీలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్(MLA Bojju Patel) ఆదేశాల మేరకు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చిన ఇందిరమ్మ చీరలను అధికారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి పెద్ద పీఠ వేస్తుందని మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, చీరల పంపిణీ, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ, అనేక మహిళా సాధికారిత అబివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సారధ్యంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి అరుణ, ఐకేపీ సీసీ విష్ణు వర్ధన్, మాజీ వైస్ ఎంపీపీ సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పెద్ది శ్రీనివాస్, సత్యం చారి, సంపత్ రెడ్డి, జాడి లచ్చన్న, అంజన్న, భూమన్న, నారాయణ, లబ్ధిదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
