గడ్డంపల్లి సర్పంచ్ గా సవారమ్మను గెలిపించండి..

  • గ్రామ అభివృద్ధికి మంత్రి వాకిటి శ్రీహరి అండ
  • ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీహరి సతీమణి వాకిటి లలితమ్మ

మక్తల్, ఆంధ్రప్రభ: మక్తల్ మండలంలోని గడ్డంపల్లి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఎం.సవరమ్మ రామాంజనేయులును భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలితమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆదివారం రోజు గడ్డంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సవరమ్మ రామాంజనేయులుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రారంభంగా గ్రామంలోని శ్రీ వాల్మీకి మహర్షి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతు, సర్పంచ్ అభ్యర్థి సవరమ్మతో కలిసి గ్రామ వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు.

ప్రతి ఇంటికి చేరుకుని ఓటర్లను కలుసుకొని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్ గా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వాకిటి లలితమ్మ మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గడ్డంపల్లి గ్రామానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని పేర్కొన్నారు.

గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నిధులను కేటాయిస్తారని, గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. గ్రామం అభివృద్ధి కావాలంటే అధికార పార్టీ ద్వారానే సాధ్యమని, ఇతరుల మాయమాటలకు నమ్మకమిచ్చవద్దని గుర్తు చేశారు.

సవారమ్మ రామాంజనేయులు గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల సేవలో ఉండడానికి సర్వసిద్ధంగా ఉన్నారని, అందుకు ఓటర్లకు అవకాశం ఇవ్వాలని, ఆమెను సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి ప్రజలు అండగా నిలవాల్సిందిగా మంత్రీ సతీమణి వాకిటి లలితమ్మ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్‌లు త్రివేణి, సుభద్ర, సవారన్న, గుండప్ప, ఎద్దుల సువన్న, సి. నగేష్, అయ్యప్ప, చక్రవర్తి ఎరుకల, నారాయణ, రాయుడు, ఖమ్మం పాటి లక్ష్మన్న, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply