Blind Champions : అందరూ అంధులే
Blind Champions : అందరూ అంధులే
- టీ 20 వరల్డ్ క్రికెట్ కప్ తెచ్చారు
- ఇద్దరూ ఆంధ్రా ఆడబిడ్డలే
- ఒకరు రాయలసీమ
- ఇండియన్ టీమ్ కెప్టెన్
- మరొకరు మన్యం బిడ్డ
- ఉమెన్ బ్లైండ్ టీమ్ హిట్టర్
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)
Blind Champions | ఆడ పిల్లనమ్మా.. ఆడ పిల్లనాని.. దిగులు చెందకమ్మా.. బాధపడకమ్మా.. ఈ పాట పదిహేనేళ్ల కిందటే.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మార్మోగి పోయింది. ఆడపిల్లలంటే.. అబలలు కాదు. ఆకాశంలో అర్థ భాగం కాదు.. అంతకంటే ఎక్కువే అని.. ఈ కాలం పిల్లలు నిరూపిస్తున్నారు. మగువ విలువ లోకానికి తెలిసింది. మగువ సహనానికి సరిహద్దులు లేవని ఇండియన్ బ్లైండ్ ఉమన్ క్రికెట్ టీమ్ (Idian Blind Women Cricket Team ) నిరూపించింది.

ఇందులో కెప్టెన్ (Captain) ఎవరో కాదు.. రాయల సీమ కరువు నేలలో వెలుగులు చిమ్మిన అనంత దీపిక (Deepika) . మరొకరు వెనుకబాటుకు చిరునామా ఉత్తరాంధ్ర మన్యం అడవి మల్లె తీగ. కొండ కోనల్లో అవతరించిన కరుణ (Karuna kumari) కిరణం. వీరిద్దరికీ కంటి చూపు దూరం. చీకటిలోనే ప్రయాణం.
సాటి పిల్లల గేలితనం, అవమానాలను భరించిన సహన శీలులు. కానీ ఇప్పుడో.. క్రికెట్ వేదికలో జగద్విజేత ( T..20 Blind Women Cricket World Champions) ఇండియన్ బ్లెండ్ ఉమెన్ క్రికెట్ టీమ్ లో .. చెలరేగిన చిచ్చర పిడుగులు. ప్రపంచ దేశాలు సాహో అని ప్రణమిల్లే స్థాయికి ఎదిగిన ఈ ఆంధ్రా ఆడబిడ్డల ఆకుంటిత దీక్ష .. ఎందరికో స్ఫూర్తి దాయకం. ఒకసారి తెలుసుకుందాం.
అది శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం.తంబాల హట్టి (Tambala hatti village) గ్రామం. మారు మూల పల్లె. ఇక్కడ సంసృతి, సంప్రదాయాలు బయటి ప్రపంచానికి భిన్నం. .పేరుకి ఇది ఆంధ్రుల తెలుగు గడ్డే. కానీ మెజార్టీ జనం కన్నడ మాట్లాడుతారు. ఇక పూజించే దేవతల పేర్లు, తిరునాళ్ళు, జాతరలు సైతం.. ఇతర ప్రాంతాలతో పోల్చితే పూర్తిగా వైవిధ్యం.

ఇక ఇక్కడ అందరూ (All Bcs) బడుగు బలహీనులే. గొల్ల, యాదవ, కురుబ సామాజిక వర్గం . గొర్రెల పెంపకం (Shephered) , కంబళి తయారీ వీరి ప్రధాన జీవనాధారం. చదువులకు ప్రాధాన్యం అంతంతే. బాల్యవివాహాలు సర్వ సాధారణం. ఇలాంటి బడుగు ఫ్యామిలీలో ఓ మణి దీపం వెలుగులు చిమ్మింది. ఆమె ఎవరో కాదు.. ఇండియన్ బ్లెండ్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్. దీపిక. ఈమె పేరు ప్రచంచ దేశాల్లో మార్మోగుతోంది.
Blind Champions | అంధురాలే.. కానీ ఆమె వెలుగుల దీపిక

Blind Champions దీపిక అమ్మానాన్న చిన చిక్కప్ప (Chinna Chikkappa).. చిక్కమ్మ (Chikkamma) . కూలీ నాలీ (poor) పనులతో బతుకు బండి లాగుతున్నారు. ఐదు నెలల ప్రాయంలో తన కన్నును తానే గోరుతో దీపిక రక్కింది. ఓ కంటి చూపు కోల్పోయింది. అమరాపురం కర్ణాటకకు సరిహద్దు ప్రాంతం కావడంతో .. దీపిక విద్యాభ్యాసం కర్ణాటకలోనే జరిగింది. దొడ్డ బానిగర (Doddabanigara) గ్రామంలో ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదువుకుంది. అంగవైకల్యం కావటంతో దీపికను సహచర విద్యార్థులు గేలి చేశారు
. ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో అంగవైకల్య పాఠశాలలో చేర్పించారు. క్రికెట్ పై దీపిక ఎక్కువ మక్కువ చూపటంతో.. ఉపాధ్యాయుల సూచనలతో తల్లిదండ్రులు క్రికెట్ కోచింగ్ (Cricket Coching) కి పంపించారు. ఆర్టీటి సంస్థ దీపికను అక్కున చేర్చుకుంది. ఆమె అభ్యున్నతికి అండగా నిలిచింది. పదవ తరగతిలో ఉండగా రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ టోర్నీలో భారీ స్కోర్ చేసింది. 2019లో జాతీయ అంధుల మహిళ జట్టు- ప్రారంభమైంది. ఆర్ డీటీ తరుపున బ్లైండ్ ఉమెన్ క్రికెట్ రంజీ మ్యాచ్ లో పాల్గొంది.
కర్ణాటక జట్టు కెప్టెన్ గా దీపిక ఎంపి-కై-ంది. ఆపై భారత జట్టు-లో చోటు- సాధించింది. 2023 లో ఇంగ్లాద్ లో జరిగిన వరల్డ్ బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టోర్నీలో అద్భుత ప్రతిభను కనపర్చారు టీ 20 వరల్డ్ బ్లైండ్ క్రికెట్ టోర్నీలో తన సత్తాను చాటుకున్నారు . ఈ టోర్నీలో కెప్టెన్ గా బ్యాటింగ్ లో రాణించారు. జట్టు- విజయం కోసం కీలకంగా మారారు. లీగ్ దశలో పాకిస్తాన్ పై 45 పరుగులకు చేశారు. సెమీ ఫైనల్లో ఆస్ట్రేల్రియాపై విజృంభించాఉ. 58 బంతులలో 91 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత జట్టును గెలిపించారు.
టీ 20 వరల్డ్ కప్ ను ముద్దాడారు. తిరిగి స్వదేశానికి వస్తున్నారు. ప్రస్తుతం స్పోర్ట్స్ కోటాలో ముంబైలోని ( Mumbai IT deparment) ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో ఉద్యోగం కూడా వచ్చింది. ప్రపంచ కప్ తో భారత దేశానికి దీపిక వస్తున్న తరుణంలో (Coming with World Cup) అమ్మానాన్న ఆనందానికి అవధి లేదు. ఊరుకు, జిల్లాకు, దేశానికే గర్వకారణంగా మారిందని ఆనంద భాష్పాలు రాల్చారు.
Blind Champions కొండ కోనలమ్మ.. కరుణమ్మ

Blind Champions అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్ల మామిడిలో (Vantla mamidi) పుట్టిన కరుణ కుమారి బ్లైండ్ ఉమెన్ టీ–20 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు జగద్విజేతగా అవతరించటానికి కీలకపాత్ర పోషించింది . క్రికెట్ అంటే తెలియని అడవి తల్లి ఒడిలోని ఓ కుగ్రామం గిరిజన (ST Girl) బాలిక ఏకంగా ప్రపంచ కప్ ను Kissed world Cup) ముద్దాడింది. ఈ నిరు పేద బిడ్డకు ఈ రోజు ప్రపంచం సలాం కొట్టింది. ఆమెలోని అంతర్లీన శక్తిని తెలుసుకుందాం.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంట్ల మామిడికి చెందిన పాంగి కరుణ కుమారికి పుట్టుకతోనే పాక్షిక అంధురాలు. ఆటలాడే ప్రాయంలో క్రికెట్ పై మక్కువ పెరిగింది. కానీ ఆడేందుకు బాల్, బ్యాట్ కొనాలంటే.. కూలీనాలీ అమ్మనాన్నకు వీలు లేదు. ఎక్కడైనా చిన్న కర్ర దొరికితే బ్యాట్‌గాను, గుండ్రని వస్తువును బాల్‌గా భావించేంది. ఈ స్థితిలో ఓ టీచరు సాయంతో రెండేళ్ల కిందట విశాఖలోని ప్రభుత్వ అంధ బాలికల హైస్కూలులో కరుణ కుమారి ఎనిమిదో తరగతిలో చేరింది.
అక్కడ క్రికెట్‌పై పట్టు సాధించింది. ఆమె పట్టుదలను గుర్తించిన పీఈటీ రవికుమార్, మరో పీఈటీ సత్యవతి ఆమెను ప్రోత్సహించారు. 2023 డిసెంబర్‌లో జాతీయ అంధ మహిళల క్రికెట్ జట్టుకు కరుణ కుమారి ఎంపికైంది. 2024లో హుబ్లీలో తొలి మ్యాచ్‌లోనే ప్రతిభ చూపింది. ఈ ఏడాది కొచ్చిలో జాతీయ టోర్నీలో సత్తా చాటింది. గత మార్చిలో కొచ్చిలోనే జరిగిన మ్యాచ్‌లో కర్నాటకను ఓడించి ఆంధ్ర జట్టును గెలిపించింది.

అంధ మహిళల టీ–20 వరల్డ్ కప్ క్రికెట్ జట్టు ఎంపిక కోసం ఆగస్టులో బెంగళూరులో నిర్వహించిన మ్యాచ్‌లో 70 బంతుల్లో 114 పరుగులు చేసి టీమ్‌లో చోటు సాధించింది. తొలిసారిగా ఈ ఏడాది అంధ మహిళల టీ–20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమైంది. శ్రీలంకలో ఆదివారం జరిగిన ఫైనల్లో నేపాల్‌తో భారత జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ పులా సరెన్ 44 పరుగులు చేయగా కరుణ కుమారి 42 పరుగులు సాధించింది. నేపాల్ అంధ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు కేవలం 12.1 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 117 పరుగులు చేసి విజయాన్ని చేజిక్కించుకుంది.
దీంతో అంధ మహిళల భారత జట్టు తొలి టీ–20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా First T 20 blind women world Cup Champions) నిలిచింది. భారత అంధ మహిళల జట్టు వరల్డ్ కప్ సాధించటం.. జట్టులో ఇద్దరు ఆంధ్రా క్రికటర్లు కీలకం కావటంతో.. రాష్ట్రానికే గర్వకారణమని సీఎం చంద్రబాబునాయుడు (Cm chandrababu) , మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్దనరెడ్డి కొనియాడారు ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ (ACA President) , సెక్రటరీ సానా సతీష్‌బాబు హర్షం వ్యక్తం చేశారు.
Click Here To Read This Nikhat Zareen | లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా !
