Election | నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్..
Election | నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్..
Election | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: నేడు తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఈసీ విడుదల చేయనున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్ల గెజిట్లు(Gazettes Reservations) పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్‌కు సోమవారం చేరుకున్నాయి. 31 జిల్లాల నుంచి మూడుసెట్ల గెజిట్లు జిరాక్స్ కాపీలతోపాటు పెన్‌డ్రైవ్‌లో తీసుకుని కమిషనరేట్లలోని హెల్ప్‌డెస్క్‌లో డీపీవో (DPO)లు అందజేశారు.
వాటిని పంచాయతీ రాజ్ అధికారులు పరిశీలించి, ఆ తర్వాత జిల్లాల వారీగా ఒక్కో సెట్ గెజిట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి (State Election Commission) హ్యాండోవర్ చేశారు. మరో గెజిట్ కాపీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు (CS Rama Krishna Rao) పంపారు. ఈ క్రమంలో ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రెడీ అయింది.
