టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్..
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) రాసిన అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. టీజీ టెట్-2026 ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,15,028 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా అధికారిక వెబ్సైట్లో లాగిన్ ఫలితాలను పరిశీలించవచ్చు.
కేటగిరీల వారీగా క్వాలిఫైయింగ్ మార్కులు
ఓసీ అభ్యర్థులు – 60 శాతం (150కు 90 మార్కులు)
బీసీ అభ్యర్థులు – 50 శాతం (150కు 75 మార్కులు)
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు – 40 శాతం (150కు 60 మార్కులు)
డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ
టెట్లో సాధించిన మార్కులకు రాబోయే డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో టెట్లో మంచి మార్కులు సాధించడం ఉద్యోగావకాశాలను పెంచడంలో కీలకంగా మారనుంది. అందుకే ఈ ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
