ఉడుంపూర్ నవ యువ శివ యూత్ సభ్యుల రక్తదానం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చెందిన నవయువ శివ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశవేణి తిరుపతి యాదవ్ జన్మదిన వేడుకలను ఆదివారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నవయువ శివ యూత్ సభ్యులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం జన్మదినాన్ని పురస్కరించుకుని యూత్ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక సేవ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నవయువ శివ యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొని కాశవేణి తిరుపతి యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.