జిల్లా పరిషత్ భవన పనులు వేగవంతం చేయాలి

జిల్లా పరిషత్ భవన పనులు వేగవంతం చేయాలి

  • కలెక్టర్ దీపక్ తివారి

వికారాబాద్, ఆంధ్రప్రభ : జిల్లాలో పరిపాలన సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు జిల్లా పరిషత్ భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవనం నిర్మాణం ద్వారా అన్ని విభాగాలను ఒకే చోట సమీకరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని, నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తూ, పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

భవనంలో ఆధునిక సౌకర్యాలు, సమావేశ మందిరాలు, కార్యాలయ గదులు ఏర్పాటు చేస్తున్నట్లు,భవనం నిర్మాణంలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని,అవసరమైన మౌలిక సదుపాయాలు విద్యుత్, నీటి సరఫరా, పార్కింగ్ వసతులు కల్పించాలని అన్నారు.ఈ భవనం పూర్తయిన తరువాత ప్రజలకు పరిపాలనా సేవలు వేగవంతంగా, సులభంగా అందుతాయని అన్నారు. మొదటి అంతస్తు పనులు పూర్తి అయిన వాటికీ పేంటింగ్ పనులు పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ తో పాటు జడ్ పి సి ఇ ఓ సుదీర్, ఉమేష్ కుమార్, డిప్యూటీ ఇ ఇ శ్రీనివాస్, సంబంధిత అధికారులు ఉన్నారు.

Leave a Reply