ఓటర్ సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని బిక్కనూర్ మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు నిజమైన ఓటరు పేరు తొలగకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందని చెప్పారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి ప్రాణం లాంటిదని తెలిపారు.

నకిలీ ఓట్లు డబ్బులు ఎంట్రీలు తొలగించడం కోసం ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో అభినందనీయమని చెప్పారు. మండల కేంద్రం తో పాటు గ్రామాలలో బిఎల్ఓ సిబ్బంది మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా పనిచేయాలన్నారు ప్రతి ఇంటి సందర్శించి ఖచ్చితమైన సమాచారం సేకరించాలని ఆయన సూచించారు. బిఆర్ఎస్ పార్టీ తరఫున సిబ్బందికి పూర్తి సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు. మండలంలో 100% నిజమైన ఓటర్లు ఉండే విధంగా చూడాలని ఆయన సూచించారు. సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు మహేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బసవయ్య ఉన్నారు.