చిన్నారి ప్రాణాలను కాపాడండి.. తల్లిదండ్రుల విజ్ఞప్తి
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జూకల్ గ్రామానికి చెందిన జీపీ సిబ్బంది ఎలగొండ సుమన్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఇటీవల ఆయన భార్యకు కవల పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరు శిశువులు కిలోగ్రాము కంటే తక్కువ బరువుతో పుట్టడంతో వారికి ప్రత్యేక వైద్యం అవసరమని వైద్యులు సూచించారు.
ప్రస్తుతం నవజాత శిశువులను ఎన్‌ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఇద్దరు శిశువులకు కలిపి రోజుకు సుమారు రూ.60 వేల వరకు వైద్య ఖర్చు అవుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ భారీ ఖర్చును భరించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
చికిత్స పొందుతున్న కవల శిశువుల్లో ఒకరు మృతి చెందగా, మరో శిశువు ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. మిగిలిన శిశువును కాపాడేందుకు దాతలు తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
ఆర్థిక సహాయం కోసం
ఫోన్‌పే: 7842849548
పేరు: బత్తుల కృష్ణ
