వైభవంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని ఆదివారం వాసవి క్లబ్, వనితా క్లబ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాలయ ప్రాంగణంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున వాసవి, వనితా క్లబ్ సభ్యులు, ఇతర భక్తులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గణపతి పూజతో ప్రారంభమైన కార్యక్రమంలో కుంకుమ పూజలు, అష్టోత్తర నామ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు నీలా రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి చెరుకు రాము, కోశాధికారి చారుగుండ్ల వెంకటేశ్వర్లు, వనితా క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ గెల్లి లక్ష్మీ ప్రసన్న, మాజీ డిస్ట్రిక్ట్ చైర్మన్లు కందిబండ శ్రీనివాసరావు, కొత్తా లక్ష్మణ్, వీరవల్లి శ్రీలత, మాజీ అధ్యక్షులు ఊటుకూరు నటరాజ్, ఉప్పల పుల్లయ్య, రాచకొండ అంజయ్య, కందిబండ నాగేశ్వరరావు, పోతుగంటి సత్యం, గుంటూరు శ్రీనివాస్, కొక్కండ్ల వెంకటేశ్వర్లు, తడకమళ్ల పరమేశం, చందా కిషన్, వాసవి క్లబ్ పీఆర్‌ఓలు టి.ఎన్. స్వామి, యీగా శ్రీనివాసరావు, చక్కా లక్ష్మణ్ పాల్గొన్నారు.

అలాగే వనితా క్లబ్ అధ్యక్షురాలు చారుగుండ్ల మల్లికాంబ, కోశాధికారి జగిని శివాని, కందిబండ శోభ, కందిబండ కళావతి, కందిబండ శైలజ, గరిణె జ్యోతి, చెరుకు కవిత, పోతుగంటి పద్మ, జగిని పుష్పలత, రాచకొండ ధనలక్ష్మి, గోళ్ల పద్మ, కొక్కండ్ల సుజాత, మా శెట్టి నర్మద, రేపాల రాజ్యలక్ష్మి, గరిణె ధనలక్ష్మి, కట్టమూడి విజయలక్ష్మి, పాల్వాయి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.