కళాకారులకు చేయూత… కొండపల్లి బొమ్మలకు కొత్త దిశ
కళాకారులకు చేయూత… కొండపల్లి బొమ్మలకు కొత్త దిశ
- ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్ లక్ష్మీశ
ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం: జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ బుధవారం ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లిలోని కొండపల్లి బొమ్మల ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించారు. ఇటీవల నిర్వహించిన కొండపల్లి బొమ్మల ఉత్సవం ఘన విజయం సాధించిన నేపథ్యంలో హస్తకళాకారులు సరికొత్త ఉత్సాహంతో వినూత్న డిజైన్లతో కళాత్మక వైభవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ, కళాకారులను ప్రోత్సహించే క్రమంలో కలెక్టర్ లక్ష్మీశ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించి, కళాకారులతో ముచ్చటించారు.
సంప్రదాయ కళను ఆధునికతతో మేళవిస్తూ కొత్త డిజైన్లు రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. హస్తకళాకారుల ప్రగతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించిన కలెక్టర్, మార్కెట్ విస్తరణకు అవసరమైన సాంకేతిక సహాయం, ప్రోత్సాహం అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. కొండపల్లి బొమ్మలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
[
