బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా చుంచు వెంకన్న మళ్లీ నియామకం

బీసీల సంక్షేమానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడి సూచన

దస్తూరాబాద్, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఐబీ భవనంలో దస్తూరాబాద్ మండల బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన చుంచు వెంకన్నకు జిల్లా అధ్యక్షుడు అనుముల భాస్కర్ నియామక పత్రాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా అనుముల భాస్కర్ మాట్లాడుతూ మండలంలో బీసీల సంక్షేమం, అభివృద్ధి, ఐక్యత కోసం చుంచు వెంకన్న నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.

చుంచు వెంకన్నకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోన్ మండల అధ్యక్షుడు మ్యాక్ ప్రేమ్ కుమార్, గంజీవార్ శ్రీకాంత్, అడ్వకేట్ పవన్ పటేల్, సారంగాపూర్ సత్యం తదితరులు పాల్గొన్నారు.