Choutuppal ఆరెగూడెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ ధనలక్ష్మి వెంకట్ రెడ్డి

Choutuppal ఆరెగూడెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ ధనలక్ష్మి వెంకట్ రెడ్డి

చౌటుప్పల్ (Choutuppal), ఆంధ్రప్రభ:

చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామాన్ని అన్ని సమస్యల నుండి విముక్తి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ ఎన్నేపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం ఆరెగూడెం గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆమె కోరారు.

చిన్నకొండూరు గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ శోభారాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఈ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గుండ్లబావి, పంతంగి, కాట్రేవు, పెద్దకొండూరు, మసీదుగూడెం గ్రామాల్లో సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించి పలు సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు.

ఈ సభల్లో ఇంచార్జీ ఎంపీడీవో బి. విజయ్ కుమార్, మండల పంచాయతీ అధికారి ఉట్కూరు అంజిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రభుత్వ పథకాలు, గ్రామాభివృద్ధి పనులపై అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.