ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-06 పదవతరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు 2 దశాబ్దాల కాలం తర్వాత ఆదివారం స్థానిక సుమంగలి ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య మిత్రులు ఒకరినొకరు కలుసుకొని, తమ ఆత్మీయతను పంచుకున్నారు. చిన్న నాటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ ,ఒకరినొకరు పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు.

విద్యార్థులు తమ గురువులతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని పంచుకొని ఆనందంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన సుమారు 20 మంది ఉపాధ్యాయులతో పాటు పాఠశాల సిబ్బందిని శాలువలతో ఘనంగా సన్మానించారు. జీవితంలో ఉన్నత స్థాయిలో ఎదిగేందుకు గురువుల పాత్ర గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ ఎడ్ల యాకు, బుంగపట్ల మహేష్, బుర్ర మధు , లెంకల మహేందర్ ,బోడ ప్రవీణ్, అంబాల మల్లేష్, గుమ్మిడేల్లి పరశురాములు,కే రాజశేఖర్, రాజు మాధవి, స్వర్ణలత , కవిత, రజిని, భార్గవి ,కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply