CONGRESS | ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

CONGRESS | ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
చీరల పంపిణీతో మహిళల్లో సంబరాలు
CONGRESS | జుక్కల్(కామారెడ్డి), ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఆదివారం ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. దీంతో ఎంపీడీవో సమావేశమందిరంలో ఐకేపీ సంఘాల మహిళలు అధికారులు, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి, మహిళలు (Women) అన్ని రంగాలలో పురుషులకు సమానంగా ఎదిగేందుకు తమ వంతు కృషి చేస్తుందని విండో చైర్మన్ నగల్గిద్దే శివానంద్ (Window Chairman Nagalgidde Shivanand) కాంగ్రెస్ పార్టీ జుక్కల్ మండల యువజన అధ్యక్షుడు సతీష్ పటేల్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ కోటేశ్వరులు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గణేష్ ఎంపీడీవో బి. శ్రీనివాస్, ఏపీఎం కే.గంగారాం తోపాటు కాంగ్రెస్ శ్రేణులు బొంపల్లి రాములు, సాయి గౌడ్, మనోహర్ పటేల్, గంగాధర్ నాయక్, కండుగొండ, ఎన్. ప్రసాద్, రామ్ గొండ, బి.విజయ్ కుమార్, సురేష్, అంజయ్య, సాయి పాల్గొన్నారు.
