Telangana | లాట‌రీ ప‌ద్ధ‌తిలో రిజర్వేషన్లు ఖరారు

Telangana |లాట‌రీ ప‌ద్ధ‌తిలో రిజర్వేషన్లు ఖరారు

Telangana |మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో లాట‌రీ ప‌ద్ధ‌తిలో రిజ‌ర్వేష‌న్లు ఖరారు చేశారు. ఈ రోజు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు వార్డు మెంబర్ (Ward member) స్థానాలకు లాటరీ ప‌ద్ధ‌తిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. మండలంలోని ప‌ది గ్రామ పంచాయతీలకు సంబంధించి మొత్తం 88 వార్డులకు గాను ఎస్పీల‌కు 20, బీసీల‌కు 24, జనరల్ కేటగిరీ కి 44 చొప్పున కేటాయించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎంపీడీఓ బాలాజీ నాయక్ (MPDO Balaji Nayak) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం లో డ్రా పద్ధ‌తిలో ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షాల నాయకులు వంగాల సత్యనారాయణ, గణగాని రాజేష్,బి ఉప్పలయ్య,లక్ష్మీనర్సయ్య,మహేశ్వరం సోమయ్య,కుర్మెటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply