Minister | వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభం

Minister | వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభం

  • తెలంగాణ ఆవిర్భాగ మెడికల్ నటించిన మంత్రి కొండా సురేఖ

Minister | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టును త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.

మంగళవారం వరంగల్ కోటలోని ఖుష్ మహల్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్‌తో కలిసి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు.

అనంతరం ఖుష్ మహల్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.

వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు ఆస్తులు, పరికరాలు పంపిణీ చేశారు.

కార్యక్రమం ముగిసిన తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్‌ను మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ), అదనపు కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులు స్టాల్స్‌లో ప్రదర్శించిన అంశాలను వివరించారు.

Leave a Reply