శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు..

ఊర్కొండ, ఆంధ్రప్రభ : శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఊర్కొండ మండపరిధిలోనీ ఊరుకొండపేట గ్రామంలో సాగర సంఘం గ్రామ అధ్యక్షుడు కాలేపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర సంగం నాయకులు మాట్లాడుతూ.. భువి నుండి దివికి గంగను తీసుకువచ్చిన మహర్షి శ్రీ భగీరథ మహర్షి అని, అలాంటి గొప్ప మహర్షి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గొప్పవిషయమన్నారు.

అనంతరం శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్, వార్డు సభ్యులు రామాంజనేయులు, నాయకులు మనోహర్ రెడ్డి, వహిదోద్దీన్, అంజయ్య ,అరవింద్, ప్రసాద్, అమీర్, సాగర సంఘం నాయకులు రవీందర్, గోవర్ధన్, తిరుపతయ్య ,బీముడు, రవి, రామదాసు, రాము, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply