మల్టీపర్పస్ వర్కర్ల సేవలు మరువలేనివి

మల్టీపర్పస్ వర్కర్ల సేవలు మరువలేనివి
– ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ప్రశంస
మరిపెడ, ఆంధ్రప్రభ:
మండలంలోని 48 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్ల సేవలు మరువలేనివని ఎంపీడీవో బి. వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి దిశగా వీరి కృషి కీలకమని ఆయన ప్రశంసించారు.
మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మల్టీపర్పస్ వర్కర్లు, కారోబార్ల నూతన కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఎంపీవో దారావత్ సొమ్లానాయక్ హాజరయ్యారు.
గ్రామాభివృద్ధి కోసం ఐక్యతతో పని చేయాలని, భవిష్యత్తులో మరింత సమర్థంగా సేవలు అందించాలని ఆయన సూచించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మల్టీపర్పస్ వర్కర్స్, కారోబార్ల యూనియన్ (సీఐటీయూ అనుబంధం) నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా అలవాల యాదగిరి (అబ్బాయిపాలెం), ప్రధాన కార్యదర్శిగా ఆకారం వేణు (ఎడిజర్ల), ఉపాధ్యక్షులుగా ఆలేటి హుస్సేన్ (ఎల్లంపేట), సహాయ కార్యదర్శిగా భూక్య బాలు (డీఎస్ఆర్ జండాల్ తండా), కోశాధికారిగా షేక్ యాకోబు అలీ (గుండెపుడి), ప్రచార కార్యదర్శిగా గంగుల మహేష్ (చిల్లంచర్ల) ఎన్నికయ్యారు.
గౌరవ సభ్యులుగా భూషిష్పాక చిరంజీవి (ఆనేపురం) సహా వివిధ గ్రామాల ప్రతినిధులు పాల్గొన్నారు.
