Captain | ప్లేఆఫ్స్ కోసం చావో రేవో పోరు!

Captain | ప్లేఆఫ్స్ కోసం చావో రేవో పోరు!

Captain | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2026 సీజన్‌లో భాగంగా నేడు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడుతున్నాయి. 48వ మ్యాచ్‌గా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండు జట్లు సమానంగా ఉన్నాయి. 9 మ్యాచ్‌ల్లో తలో నాలుగు విజయాలతో ఉన్న ఈ రెండు జట్లకూ ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ విజయం అత్యంత కీలకం. రన్ రేట్ పరంగా మెరుగ్గా ఉన్న చెన్నై 6వ స్థానంలో ఉండగా, ఢిల్లీ 7వ స్థానంలో కొనసాగుతోంది.

Leave a Reply