Key Changes | తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీలు?

Key Changes | తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీలు?

Key Changes | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయంగా కీల‌క మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతల కొత్త పార్టీల ప్రకటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్ అయిన అనంతరం, కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్‌) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. ఇక వైసిపికి దూరమైన విజయసాయి రెడ్డి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్ర‌క‌టించారు. జూలైలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

2026లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. ఈ పార్టీకి ‘తెలంగాణ రాష్ట్ర సేనస నామ‌క‌ర‌ణం చేశారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన ఆవిర్భావ సభలో పార్టీ పేరును ప్ర‌క‌టించారు. తెలంగాణ ఆకాంక్షలు, సామాజిక తెలంగాణ లక్ష్యాల కోసం ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు కవిత తెలిపారు.

వైసీపీ మాజీ నేత‌, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కొత్త పార్టీ పెట్టాల‌నే యోచ‌న‌లో ఉన్నారు. దీనిపై ఆయ‌న ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ఏపీ రాజకీయాల్లో శూన్యత ఉందని, అందువల్ల కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందని ఆయ‌న పేర్కొన్నారు. ఏపీలో వైసీపీకి మ‌నుగ‌డ లేద‌ని, ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని చెప్పారు. కూటమి కలిసికట్టుగా ఉన్న‌న్నీ రోజులు వైసీపీ గెలిచే చాన్స్ లేద‌ని విశ్లేషించారు. ఇపుడు చూస్తే ఏపీలో కొత్త పార్టీ కోసం అనుకూల వాతావరణం ఉందని అంటున్నారు. పార్టీకి తోడుగా మీడియా రంగాన్ని తోడు తెచ్చుకోవాల‌ని విజ‌య‌సాయిరెడ్డి యోచిస్తున్నారు. తాను తొందరలోనే మీడియా రంగంలోకి అడుగు పెడతాను అని ఆయన ఒక ప్ర‌క‌ట‌న కూడా చేశారు.