టీడీపీతోనే ముస్లింల అభ్యున్నతి
టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎండీ హనీఫ్
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : మైనార్టీల సంక్షేమం, హక్కుల రక్షణ కేవలం తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమని టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎండీ హనీఫ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల చిలకలూరిపేట పర్యటనకు వచ్చిన సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలసి ముస్లిం మైనార్టీలకు టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల పట్ల మైనార్టీల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినట్లు వెల్లడించారు.
ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనం, మత పెద్దల సేవలను గుర్తిస్తూ వారికి నెలవారీ గౌరవ వేతనాలు అందించడం. మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఆర్థిక భరోసా కల్పించడం, మక్కా తీర్ధయాత్రకు చేయూత అందించటం తదితర అంశాలను ప్రస్తావించి కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీ లు పేదరికంలో ఉన్నారని, విద్యావసతులు కూడా కరువయ్యాని సీఎం దృష్టికి తెచ్చానని, ముస్లింల జీవనోపాధి మెరుగయ్యే విధంగా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలని, గతంలో ముస్లిం మైనార్టీల కోసం ఉన్న దుకాన్ ఔర్ మకాన్ లాంటి పథకాలు తిరిగి పునరుద్దరించాలని కోరినట్లు చెప్పారు.
ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని డాక్టర్ హనీఫ్ తెలిపారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృషితో ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. మైనార్టీలకు ఉద్యోగ అవకాశాలు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు వంటి అంశాలపై సానుకూలంగా స్పందించాలని టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎండీ హనీఫ్ కోరారు.
