భక్తులకు మజ్జిగ పంపిణీ చేసిన సామినేని ఉదయభాను

భక్తులకు మజ్జిగ పంపిణీ చేసిన సామినేని ఉదయభాను

దుర్గగుడి వద్ద జనసేన ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

భవానిపురం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసైనికులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం శుభపరిణామమని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు.

మంగళవారం విజయవాడ దుర్గగుడి ఆలయం ప్రాంగణంలో జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం భక్తులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే జనసేన పార్టీ లక్ష్యమని తెలిపారు. గత కొన్ని రోజులుగా బాడిత శంకర్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మూర్తి, డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ, గాదిరెడ్డి అమ్ములు, కొంపల్లి అరుణ్ కుమార్ నాని, దోమకొండ అశోక్, కమ్మిలి రంగా, సమతం సత్తిబాబు, బీసీ రాష్ట్ర నాయకులు కొమ్మవరపు భాను ప్రసాద్, రుద్రశేఖర్ నాయుడు, శ్రీనివాస్ రావు, సోడిశెట్టి రాధా, హనుమంతు, వీర మహిళలు అచిత, పూర్ణిమ పాల్గొన్నారు.

Leave a Reply