bus l మహాశివరాత్రికి.. స్పెషల్ బస్సులు

bus l మహాశివరాత్రికి.. స్పెషల్ బస్సులు

bus l నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ: మహాశివరాత్రి పండుగ సందర్భంగా నంద్యాల జిల్లాలో ప్రత్యేకంగా 200 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారి రజియా సల్తానా తెలిపారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, మహానంది, ఓంకారం బ్రహ్మగుండం, కోలను భారతి సంగమేశ్వరం, యాగంటి, రుద్రకోడూరు, భోగేశ్వరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతున్నందున బస్సులను అధికంగా ఏర్పాటు చేశామన్నారు. ఆళ్లగడ్డ డిపో నుంచి పది బస్సులు, ఆత్మకూర్ డిపో నుంచి 45 బస్సులు, బనగాని పల్లె డిపో నుంచి 15, డోన్ డిపో నుంచి 15 బస్సులు, కోవేలకుంట్ల నుంచి 14 బస్సులు, నందికొట్కూరు నుంచి 43 బస్సులు, నంద్యాల డిపో నుంచి 58 బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు.

నంద్యాల నుంచి శ్రీశైలంకు 320 రూపాయలు బస్సు టికెట్ గా నిర్ణయించారు. ఆదోని టు శ్రీశైలం కు 500 రూపాయలు, ఎమ్మిగనూరు టు శ్రీశైలం కు 450 రూపాయలు , కర్నూల్ టు శ్రీశైలం కు 350 రూపాయలు, నందికొట్కూరు నుంచి శ్రీశైలం 300 రూపాయలు, ఆత్మకూరు నుంచి శ్రీశైలంకు 250 రూపాయలు, దోర్నాల నుంచి శ్రీశైలం శ్రీశైలం కు 130రూపాయలు, మహానంది నుంచి శ్రీశైలం కు 350 రూపాయలు, బస్సు టికెట్లను నిర్ణయించినట్లు తెలిపారు.

ఆర్టీసీలో ప్రయాణించే భక్తుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రజియా సుల్తానా తెలిపారు. శివరాత్రి జాతర నిర్మాణ కోసం 18 మంది ఆఫీసర్లు, 80 మంది ఉద్యోగులను ఏర్పాటు చేశామన్నారు. బస్సుల మెయింటెనెన్స్, పర్యవేక్షించడానికి శ్రీశైలం బస్ స్టేషన్ శిఖరం హఠకేశ్వరం, దోర్నాల పాయింట్ వద్ద అవసరమైన స్పేర్ పార్ట్స్ ను, మెయింటినెన్స్ సిబ్బందిని డిజీటీ రిలీఫ్ క్యాంప్స్ ను ఏర్పాటు చేశామన్నారు.


శ్రీశైలం నుంచి దోర్నాల మధ్యలో బస్సులు మరమ్మతులకు గురైనతో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా తుమ్మలబైలు చింతల వద్ద మెకానికల్ సిబ్బందితో స్పేర్ బస్సు ఏర్పాటు చేసామన్నారు. దోర్నాల నుంచి తుమ్మల బయలు వరకు దోర్నాల నుంచి శిఖరం వరకు మొబైల్ రిలీఫ్ టీ మ్స్ ను నిర్వహిస్తామన్నారు. బస్సుల రాకపోకలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దోర్నాల పాయింట్ వద్ద ఎంఐఎస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే బస్సుల నిర్వహణ కోసం గుర్తించిన బస్సులకు ఘాట్ ఎలిజబుల్ అనే స్టిక్కర్ ఉన్న బస్సులను మాత్రమే ఘాట్ రోడ్ లో నడుపుటకు అనుమతిస్తామన్నారు.

భక్తుల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపును ఆర్టీసీ ఆధ్వర్యంలో శ్రీశైలం నందు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రయాణికులు సురక్షితం గా ప్రయాణం చేయాలని ఆమె కోరారు.

Leave a Reply