ఇలాంటి దురదృష్ట సంఘటన ఎవరికి జరగద్దు

  • మృతుల కుటుంబాలకు బంజారా జేఏసీ నాయకులు పరామర్శ

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని పులిమడుగు చెందిన కారోబారి రాంజీ, ఆడే ప్రకాష్ ను రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందగా శుక్రవారం లంబాడ జేఏసీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి భానోత్ జగన్ నాయక్, ప్రజా సంఘాల జేఏసీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నేతావత్ రాందాస్ నాయక్, భానోత్ రామారావు తదితరులు మృతుల కుటుంబాల ఇంటి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఇలాంటి దురదృష్ట సంఘటన ఏ గ్రామంలో కూడా ఎవరు కూడా భవిష్యత్తులో జరగవద్దని వారు అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆడ దినేష్, రాథోడ్ రమేష్, రాథోడ్ ప్రేమ్ దాస్ తదితరులు పాల్గొన్నారు