91. ఊహనున్న చాలు ఓంకారరూపుడు
పూజ చేయకున్న పున్యమేను
మనసుపడుట వందమందిరమ్ముల పెట్టు
గీతదాత నీకు కేలుమోడ్తు
92. జీవితమ్ము రణము చింతించనేలనో!
అలుపు సొలుపు లేక గెలుపు రాదు
భక్తుడొకడె యతడు భావింప విజయుడు
గీతదాత నీకు కేలుమోడ్తు
93. ఉన్నవాడొకడును తిన్నవాడొకడును
ఎవరికెరుకయగును ఎచటనయిన
చెట్టు పెంచునొకడు సేదదీరునొకడు
గీతదాత నీకు కేలుమోడ్తు